calender_icon.png 12 October, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే దొంతిని పరామర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

11-10-2025 06:59:41 PM

హన్మకొండ (విజయక్రాంతి): ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లీ దొంతి కాంతమ్మ అనారోగ్యంతో మరణించగా శనివారం నీటి పారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచందర్ నాయక్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్.నాగరాజ్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.