11-10-2025 07:01:14 PM
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ మండలం బీరంగూడ నగర్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కిష్టారెడ్డిపేటలో 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల సుమారు 200 మంది బాలలతో బాల పథ సంచలన్ నిర్వహించారు. కార్యక్రమం ఆరంభంలో కాషాయం పతాకాన్ని ఎగురవేసి ధ్వజారోహణ చేశారు. అనంతరం చిన్నారులు కిలోమీటర్ మేర గ్రామ ప్రధాన వీధుల గుండా దేశభక్తి నినాదాలతో రూట్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘ్ సభ్యులు మాట్లాడుతూ పిల్లల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం వంటి మూల్యాలను పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చిన్నారులను ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీరంగూడ నగర్ గర్వకారణంగా నిలిచేలా 200 మంది బాలలతో నిర్వహించిన ఈ పథ సంచలన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.