03-09-2025 01:47:06 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(District Collector Badawat Santosh) బుధవారం శ్రీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిశీలనతో పాటు మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా? అంటూ విద్యార్థులను ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారిని ప్రోత్సహించారు. క్రమశిక్షణతో చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. హాజరు పెంచేందుకు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.