09-07-2025 07:38:00 PM
మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్(Peerzadiguda Municipal Corporation) పర్వతాపూర్ లో రిధి డెంటల్ క్లినిక్ రెండవ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మేయర్ అమర్ సింగ్ కేక్ కట్ చేసి మాట్లాడుతూ... సమాజానికి వైద్య సేవలు అందించడంలో డెంటల్ క్లినిక్ లు కీలకపాత్ర పోషిస్తాయి అని తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత డెంటల్, మెడికల్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నుండి పెద్దవాళ్ల వరకు పరీక్షలు చేయించుకొన్నారు. క్లినిక్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ... ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించి నాణ్యమైన దంత చికిత్సలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొడిగె కృష్ణ గౌడ్, యాషారం మహేష్, మేడిపల్లి హనుమాన్ టెంపుల్ చైర్మన్ రామిరెడ్డి, మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు చిలుముల అజయ్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు వైద్య సిబ్బంది స్థానిక సిబ్బంది ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.