09-07-2025 06:53:38 PM
సబ్ కలెక్టర్ కిరణ్మయికి కార్మిక సంఘాలతో వినతి పత్రం అందజేత..
బాన్సువాడ (విజయక్రాంతి): సిఐటియు(CITU) పిలుపుమేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి అంగన్వాడి టీచర్లు ఆయాలు మున్సిపల్ వర్కర్లు ఆటో డ్రైవర్లు గ్రామపంచాయతీ వర్కర్లు కలసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్ మాట్లాడుతూ... బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జీవితాంతం పరిపాలిస్తామని భ్రమలో బతికిస్తున్నారు కానీ ఇది అసాధ్యం ఎంతోమంది వీరులు వాళ్ల ప్రాణాలు త్యాగం చేసి కార్మికుల 29 చట్టాలు సాధించుకున్నారు కానీ బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ నాలుగు కోట్లుగా విభజించింది.
ఆ కోడ్లల్లో కార్మిక వర్గాన్ని పూర్తిగా నష్టపోతారు. బిజెపి ప్రభుత్వం ఆలోచన పెట్టుబడులు దారుల కోసం పెట్టుబడిదారులకు కార్మికులతో ఎనిమిది గంటల పని విధానాన్ని తీసేసి 14 గంటలు పని చేపించాలని ఆలోచనలో ఈ కోడ్లు తెచ్చింది. ఇప్పటికైనా తనను మారుస్తూ కార్మికులకు న్యాయం చేయాలి, అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు తీర్పు మేరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనాలు 26000 రూపాయలు ఇవ్వాలి పీఎఫ్ ఈఎస్ఐ కల్పించాలి, ఉద్యోగ భద్రత స్థానిక సమస్యలు పరిష్కరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు 12 వేల రూపాయలు ఇస్తామని ఎన్నో బహిరంగ సభలలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పటికైనా ఆటో కార్మికులు అందరికీ ఆదుకోవాలని కోరుతున్నాము.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాతలో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వకున్నా కచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు మేము అండగా ఉంటామని మీ హామీలన్నీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో బహిరంగ సభలలో హామీల వర్షాలు కురిపించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెయ్యకపోతే ఇంతకన్నా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మహాదేవి ఆశా వర్కర్ విజయ మున్సిపల్ వర్కర్ అధ్యక్షుడు బుజ్జి గారి సాయిలు లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు చాంద్ ఆసిఫ్ ఖాన్ అంగన్వాడి ఆయాలు గ్రామ పంచాయతీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.