calender_icon.png 10 July, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మొక్కలు నాటిన సూపరింటెండెంట్..

09-07-2025 06:44:48 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి(Hospital Superintendent Dr. Vijayalakshmi) మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకై మొక్కలను పెంచాలని ఆమె తెలిపారు. చెట్లను పెంచి పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవాలని సూచించారు. చెట్లను పెంచడం ద్వారా ఆసుపత్రికి వచ్చే రోగులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ గాలి అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఆర్ఏంఓ సుజాత ప్రభాలత కృష్ణవేణి యూడీసీ లక్ష్మణ్ ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.