calender_icon.png 6 December, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదవెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న మంత్రి,విప్

06-12-2025 12:00:00 AM

  1. రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, 

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

బోయినపల్లి: డిసెంబర్ 05(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం లోని వరదవెల్లి లో స్వయంభుగా వెలసిన దత్తాత్రేయ స్వామి ఆలయము మద్యమానీరు జలాశయం మధ్యలోకి వచ్చింది...స్వామివారిని దర్శించుకునేందుకు ప్రస్తుతానికి బోట్ సౌకర్యం ఉంది.దత్తాత్రేయ స్వామివారిని నిరంతరం దర్శించుకునే విధంగా ప్రతిపాదనలు చేశాం...ప్రస్తుతం ప్రతిపాదనలు ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్నాయి...రెండు సంవత్సరాల ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాం.

ప్రజాహితంగా పని చేసే వారిని ముందుకు తీసుకురావాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో సూచించారు రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి సంక్షేమాలు గ్రామస్థాయి వరకు అందేలా ప్రజాహితంగా ఉండే వారిని ఆదరించాలి.ప్రజలందరిపై దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ కొ ట్టేపల్లి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి,నాయకులు సంబ లక్ష్మి రాజం, ఏనుగుల కనుకయ్య తదితరులు వున్నారు.