calender_icon.png 20 January, 2026 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం

09-08-2024 12:50:35 AM

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త ఆహారభద్రత (రేషన్) కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తామని ఇటీవల ప్రకటన చేయడంతో ఆ దిశగా చర్యలు వేగం చేసింది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుకు సీఎస్ శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  చైర్మన్‌గా, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను సభ్యులుగా నియమించింది. రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్‌కార్డుల కోసం వార్షికాదాయం, భూపరిమితి వంటి అంశాలపై సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది.