07-01-2026 12:00:00 AM
సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి
గుమ్మడిదల, జనవరి 6: ఎల్లమ్మ తల్లి కృపతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆనందంగా ఉండాలని బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలో మంద సంతోష రమేష్ దంపతుల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, గణేష్ అప్ప, సూర్యనారాయణ, చంద్రశేఖర్, కరుణాకర్ గౌడ్, బ్రహ్మేంధర్ గౌడ్, నర్సింగరావు, నిఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.