calender_icon.png 26 November, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

26-11-2025 12:00:00 AM

కొండాపూర్, నవంబర్ 24 : కొండాపూర్ మండలం తొగర్ పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా మంగళవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులు గోపులారం సంతోషకు రూ.23,000, బొడ్డు క్రాంతికి రూ.13,500, కుమ్మరిగొల్ల మధుకు రూ.21,500 కలిపి మొత్తం రూ.58,000 చెక్కులు అందజేశారు.

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడు తూపేదవారి ఇబ్బందులు, వైద్య ఖర్చులు, అత్యవసర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ తో ఆదుకుంటోందని తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రోళ్ల రవి మాట్లాడుతూ మా గ్రామంలో ఎవరికీ ఇబ్బందులు ఉన్నా ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.