calender_icon.png 26 November, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

26-11-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, నవంబర్, 25 (విజయక్రాంతి): చదువుతోపాటు చిన్నతనం ఉండే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెం పొందించుకునే విధంగా విద్యార్థులు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఉద్బోధించారు. మహబూబాబాద్ పట్టణంలోని అనంతారం ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ తిలకించి వారు రూపొందించిన వివిధ ఎగ్జిబిట్లను పరిశీలించి అబ్బురపడ్డారు.

ఈ సంద ర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో ఆలోచన శక్తిని రేకిత్తి స్తాయన్నారు. బట్టి పద్ధతిని వీడాలని, చదువుతో పాటు ఆయా అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. పుస్తకాలు చదవడం, రాయడం మాత్రమే కాకుండా అందులోని విషయ పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాష్ట్ర , జాతీయ స్థాయిలో స్థానం సంపాదించేలా ప్రయత్నం చేయాలని, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులను పలు ఎగ్జిబిట్లపై పరిశోదన పద్దతులను విద్యార్థులను అడిగి వారి యొక్క వివరణను పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి దక్షిణామూర్తి, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, ఉపాద్యాయులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.