27-09-2025 10:25:32 PM
బాధ్యతలు స్వీకరణలో ఎస్ఐ రవికుమార్
ముత్తారం,(విజయక్రాంతి): మండల ప్రజలు పోలీసులకు సహరించాలని శనివారం ముత్తారం పోలీస్ స్టేషన్ లో బాధ్యతల స్వీకరణలో ఎస్ఐ రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండల ప్రజలు పోలీస్ స్టేషన్ కు మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రావాలని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. భూపాలపల్లి జిల్లా వీఆర్వో లో ఉన్న ఎస్ఐ రవికుమార్ ముత్తారం పోలీస్ స్టేషన్ కు బదిలీ పై రాగా, పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎస్ఐ కి సిబ్బంది స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు.