calender_icon.png 17 November, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ప్రతిభ అభినందనీయం

17-11-2025 05:24:10 PM

నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా తమ ప్రదర్శనలు తయారు చేయడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో విద్యావ్యవస్థ ఎన్జీసి ఆధ్వర్యంలో నిర్మల్ వేస్ట్ టు వెల్త్ వృధా వస్తువుల నుంచి సంపదను సృష్టించడం అనే అంశంపై నిర్వహించిన పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ, తిమ్మాపూర్ ఖానాపూర్ కు చెందిన అద్భుతమైన కళాకృతులు, గృహా అలంకరణ పశువులను తయారు చేసి అందరి ప్రశంసలు పొంది రెండవ బహుమతి సాధించారు. ఈ పోటీలలో పాఠశాలకు చెందిన విద్యార్థి కె.సూరజ్  ప్రధానోపాధ్యాయురాలు  కే.సుజాత సూచనలు సలహాల మేరకు కళాకృతులను తయారు చేశాడు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.