calender_icon.png 22 November, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియా కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే గాంధీ

22-11-2025 12:03:32 AM

శేరిలింగంపల్లి అభివృద్ధిపై చర్చ 

శేరిలింగంపల్లి,నవంబర్ 21 (విజయక్రాంతి): జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం లో నెలకొన్న పలు అభివృద్ధి పనులపై చర్చించిన  ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ  శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో జరు గుతున్న ఎచ్ సిటీ ప్రాజెకట్స్ పనులు ఎస్ ఎన్ డి పి విభాగంలో జరుగుతున్న నాలల విస్తరణ పనులను వేగవంతం చేయాలని,  పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు విషయంలో అవసరమైతే ముఖ్యమంత్రి  రేవం త్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలియజేశారు.చెరువుల సుందరికరణ,  మరమ్మతుల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా సంబంధిత అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలియచేసారు. కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సా నుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.