calender_icon.png 22 November, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజాపూర్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

22-11-2025 12:17:02 AM

మరో ఐదుగురికి తీవ్ర గాయాలు

మొయినాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : హైదరాబాద్--బీజాపూర్ రహ దారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్లో అతివేగంతో వచ్చిన కారు, ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా... మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా  తాండూరు పట్టణానికి చెందిన వంశీధర్‌రెడ్డి  పాండురంగారెడ్డి  శుక్రవారం ఉదయం 7:30 గంటలకు మొయినాబాద్ లోని హైదరాబాద్-బీజాపూర్ రహదారి పక్కన ‘ఆన్ ది వే‘ డ్రైవిన్ (పెంటయ్య) హో టల్ ముందు హైదరాబాద్ నుండి చేవెళ్ల వెళ్తున్న (టీజీ 07 టీ 1203 ) కారు ఎదురుగా రాంగ్ రూట్ లో అతివేగంతో టీఎస్ (08 ఎఫ్‌వీ 8288) కారును ఎదురుగా బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో  సుజాత, వారి బంధువు  రోజా, డ్రైవర్ వెంకట్‌లకు గాయాలయ్యాయి. డ్రైవర్ వెంకట్ కి తీవ్రమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. రాంగ్ రూట్లో వచ్చిన కారులో ప్రయాణిస్తున్న నలుగురులో కారు డ్రైవర్ కరీం అక్కడికక్కడే మృతి చెందాడు.

గాయాలైన వారిని స్థానిక భాస్కర్ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పటల్‌లో చికిత్స పొందు తూ.. లోకేష్ మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన వారు బాబురావు, అఖిల్, సుజాత, రోజా, స్వల్ప గాయాలతో స్థానిక భాస్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీస్  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.