26-05-2025 01:21:50 AM
కరీంనగర్, మే 25 (విజయక్రాంతి): కరీంనగర్ నగర పా లక సంస్థ పరిధిలోని 20 డివిజన్లో గల ఆరేపల్లిలో ఆదివారం స్మశాన వాటికలో అభివృద్ధి పనులు, కల్వర్టు నిర్మాణానికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూ మి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ డివిజన్ గతంలో గ్రామ పంచాయతీగా ఉండేదని, డివిజన్ వాసులకు స్మశాన వాటిక లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..స్మశాన వాటిక నిర్మాణానికి 15వ ఫైనాన్స్ నిధుల నుండి సుమారు 49. 50 లక్షల రూపాయలను వెచ్చించి అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అదేవి ధంగా ఆరేపల్లి నుండి రాణిపూర్ నగునూరు దుర్గామాత ఆలయానికి వెళ్లే దారిలో సాధారణ నిధుల ధ్వార సుమారు 12 లక్షల రూపాయలను వెచ్చించి కల్వర్టును నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎన్నారైల ఆధ్వర్యంలో జూన్ 2 న అమె రికాలో డల్లా స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారని.. ఆ వేడుకలకు బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ తో పాటు తాను, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లు హాజరవుతున్నట్టు తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. ఇటీవల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తు చేశారు.
ప్ర తి సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని.. ఈఏడు మాత్రం ప్రత్యేకంగా అమెరికాలో ఎన్నారైల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినటువంటి ఆవిర్భావ దినోత్సవ వే డుకలకు దాదాపు ఎమ్మెల్యేలందరం హాజరవుతున్నట్టు తెలిపారు.ఈ నెల 31న న్యూయార్క్ లో బి ఆర్ ఎస్ ప్రిలిమినరీ సమావేశం ఉంటుందని తెలిపారు. సుమారు 12 రోజులపా టు ఈ పర్యటన ఉంటుందన్నారు.
బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వా మ్య బద్ధంగా ఉన్న పార్టీ అని ప్రతి ఒక్కరి అభిప్రాయాలను వారు తెలియజేయవచ్చునని.. కానీ బహిరంగ లేక రాయడం కాకుండా కెసిఆర్ కు వ్యక్తిగతంగా విషయాలను చెప్పి ఉంటే బాగుండు అని కేటీఆర్ చేసిన వాఖ్యలను తాను కూడ ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. కెసిఆర్ మాకు నాయకుడని.. వారి బా టలో ప్రతి ఒక్క కార్యకర్త నడుచుకుంటారు అన్నారు.
కెసిఆర్ ఆదేశాలను పాటిస్తామన్నారు. కవిత పార్టీ పెట్టడంఅనేది ఊ హాగానాలే అని కొట్టిపడేశారు. ఈ కార్యక్రమంలో నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు తు ల బాలయ్య, జంగిలి సాగర్, జంగిలి ఐలేందర్ యాదవ్, దిండిగాల మహేష్, నాయకులు పిల్లి మహేష్ గౌడ్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, మాజి సూడా డైరెక్టర్ నేతి రవివర్మ, తదితరులుపాల్గొన్నారు.