calender_icon.png 29 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి ప్రయత్నంలోనే.. లక్ష్యచేదన

29-09-2025 12:00:00 AM

గ్రూప్ 1 లో సి టి ఓ  గా ఉద్యోగం సంపాదించిన  కుమారి బోడ ప్రేరణ

 అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 28: మలక్ పేటలో నివాసం ఉంటూ... చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న బోడ విజయ్ కుమార్, భాగ్యలక్ష్మి దంపతులకు ప్రేరణ ప్రధమ సంతానం... చిన్నప్పటి నుంచే విశేష ప్రతిభ గల ప్రేరణ 10 వ తరగతి వరకు మూసారంబాగ్ లోనూ డిప్లొమా టీ ఆర్ ఆర్  కాలేజీ లోనూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మాతృశ్రీ లోనూ చదివింది.

ఎలాగైనా సివిల్స్ సాధించి ఐఏఎస్  సాధించాలనే ధ్యేయం తో... పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది.. సురక్ష సేవా సంఘం సభ్యురాలిగా ఎన్నో సేవాకార్యక్రమాలు లో పాలుపంచుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలలో  మొదటి ప్రయత్నం లోని కమర్షియల్ టాక్స్ అధికారిని గా నియామక పత్రం అందుకుని ఖమ్మం జిల్లా కు కేటాయించబడింది.  ఈ సందర్భంగా సురక్ష సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ ప్రేరణ కి కలిసి శుభాకాంక్షలు తెలియజేసి. ఆడపిల్లలు అనుకుంటే ఏదైనా సాధిస్తారని అమ్మాయిలు అంతా ఇదే స్పూర్తి తో కష్టపడి వారి కలలు సాకారం చేసుకోవాలని కోరారు.