calender_icon.png 26 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

26-09-2025 12:37:29 AM

 చిన్న చింతకుంట సెప్టెంబర్ 25 విజ్ఞాన, సాహిత్యరంగాలను గ్రామ వాసులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో మండల కేంద్ర పరిధిలోని దమ్మగ్నాపూర్ గ్రామంలో నూతన గ్రంథాలయం గురువారం జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి తో కలిసి నూతన లైబ్రరీనీ దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలిస్తూ ఎమ్మెల్యే మాట్లాడారు.  అందుబాటులో ఉన్నపుస్తకాలు సద్వినియోగం చేసుకోవాలని.

అదేవిధంగా నేటియువత, విద్యార్థులు, విద్యావంతులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గ్రంథాలను రచించడం ద్వారానే బమ్మెర పోతన, కాళోజీ సోదరులు మహాకవులుగా, సాహితీవేత్తలుగా ఎదిగారని తెలిపారు.గురువులు, తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలంటే విద్యార్ధులు, యువత సెల్ఫోన్ల కంటే పుస్తక పఠనం అలవర్చుకుని ఉన్నతంగా రాణించి సమాజానికి సేవలందించాలని కోరారు. పుస్తకాలు చదివితే విజ్ఞానం పెరుగుతుందని, ఇందుకోసం యువత గ్రంథాలయాలను అధ్యయనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.