calender_icon.png 26 September, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షెట్టిపేట టీచర్‌కు ఎక్సలెన్స్ అవార్డు

26-09-2025 12:37:41 AM

లక్షేట్టిపేట, సెప్టెంబర్ 25 : మండలంలోని జెండా వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు చీర్ల సతీష్ నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు అం దుకున్నారు. విద్యార్థుల్లో ఇన్నోవేటివ్ అంశాల పట్ల ఆసక్తి పెంచుతూ, వినూత్న రీతిలో బోధన చేస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు,

ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్ రోల్మెంట్ పెంచేందుకు కృషి చేసినందుకుగాను హైదరాబాద్ శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర ఆడిటోరియంలో 2025 సంవత్సరానికిగాను ఈ అవార్డు అందజేశారు. అవార్డు అందుకున్న చీర్ల సతీష్ ని డీఈఓ యాదయ్య, ఎంఈఓ శైలజ, పాఠశాల హెచ్‌ఎం యశోధర, ఉపాధ్యాయులు అభినందించారు.