25-07-2025 02:32:26 AM
తలకొండపల్లి,జులై 24: తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో లక్ష్మి నరసింహా స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన శ్రీలక్ష్మి సుదర్శన నర్సింహ యాగంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. యాగంలో పాల్గొనేందుకు వచ్చిన ఏమ్మెల్యే కు ఆలయ సాంప్రదాయ ప్రకారం అర్చకులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నియోజకవర్గం లో సకాలంలో వానలు కురవాల ని పంటలు సమృద్ధిగా పండి, నియోజకవర్గ ప్రజలు సుఖ,శాంతులతో వర్ధిల్లాలని పూజలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ గీతా, పీసీసీ సభ్యులు ఆయిల్ల శ్రీ నివాస్ గౌడ్,మండల కాంగ్రేస్ పార్టీ అద్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి, నాయకులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి,కాసు శ్రీనివాస్ రెడ్డి,ఆలయ దర్మకర్త శ్రీనివాసమూర్తి,డేవిడ్ పాల్గొన్నారు.