calender_icon.png 27 July, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్ల శ్రీవిద్యను కాపాడండి

25-07-2025 02:32:33 AM

మానవ హక్కుల వేదిక డిమాండ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): సీపీఐ (మావోయిస్టు) కార్యక ర్త నార్ల శ్రీవిద్య(52)(నార్ల సుధాకర్ శర్మ కుమార్తె)ను హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలో సాయుధులైన వ్యక్తులు అపహరించిన ట్టు ఆమె కుటుంబ సభ్యులు తమ సంస్థకు సమాచారం ఇచ్చారని మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, ఉభయ రాష్ట్రాలసమన్వయ కమిటీ సభ్యుడు ఎస్ జీవన్ కుమార్ తెలిపారు.

ఆమెను అపహరించి తీసుకెళ్లినవారు మఫ్లీలో ఉన్న పోలీసులా లేక ప్రైవేట్ వ్యక్తులా తెలియదని, నార్ల శ్రీవిద్య మావోయిస్టు పార్టీ సభ్యురాలయినందు వల్ల ఆమెకు హాని జరిగే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు భయం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను తీసుకెళ్లిన వారు పోలీసులయితే చట్ట ప్రకారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని, పోలీసులు కాకుంటే ఆమెను వెతికి, ఆమెపై కేసులు ఏమైన ఉంటే చట్ట ప్రకారంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.