calender_icon.png 31 August, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు అర్పించిన అమరవీరులు ప్రజల గుండెల్లో సజీవంగా ఉంటారు..

30-08-2025 09:15:44 PM

- కామారెడ్డి వరద బాధితుల సహాయ కార్యక్రమానికి వెళ్తున్నాం

- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు (విజయక్రాంతి): ఉద్యమకారుల త్యాగం ఆత్మ ఫలితాలే 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం కళా సహకారం అయిందని, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు ప్రజల గుండెల్లో సజీవంగా ఉంటారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. శనివారం జరిగే అసెంబ్లీ మొదటి రోజు సమావేశానికి మునుగోడు నియోజకవర్గం నుండి బయలుదేరి అభిమానులు ముఖ్య నాయకులతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద తన అనుచరులు, ముఖ్య నాయకులతో కలిసి నివాళులు అర్పించిన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. స్తూపం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ, త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రం 60 ఏళ్ల కల నెరవేరింది.

తెలంగాణ ఉద్యమకారులు వారి కష్టం ఎంతోమంది అమరవీరుల ఆత్మ బలిదానాల త్యాగమే నేటి స్వరాష్ట్ర తెలంగాణ, అమరవీరుల స్తూపం అంటే మాకు గుడితో సమానం అని కొనియాడారు. కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను సహాయ చర్యలలో పాల్గొన్నందుకు వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బూడిద లింగయ్య, జాల వెంకటేశ్వర్లు, మాధగోని రాజేష్ గౌడ్, నకరికంటి యాదయ్య, జక్కలి శ్రీను ,పాల్వాయి జితేందర్ రెడ్డి, పాలకూరి యాదయ్య, కుంభం చెన్నారెడ్డి, పోగుల ప్రకాష్, జిట్టగోని యాదయ్య, జెనిగేయాల సైదులు, మాదరగొని యాదయ్య, జాజుల సత్యనారాయణ, జాజుల స్వామి, దాం యాదయ్య, ఆరేళ్ల సైదులు ఉన్నారు.