10-08-2025 11:59:03 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ పట్టణంలో ఇటీవల మరణించిన పొలెపాక కొండల్, యాట శంకరయ్య, పబ్బు అండాలు, పోలేపాక నర్సమ్మ, రచ్చ శ్రీను, ఎగే నవీన్, బత్తిని స్వామి గౌడ్ కుటుంబాలను ఆదివారం రాత్రి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.