calender_icon.png 15 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొహర్రం ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

26-06-2025 12:23:11 AM

మేడ్చల్, జూన్ 25(విజయ క్రాంతి):   మల్కాజిగిరి నియోజకవర్గంలోని వెంకటాపురం డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ షఫీ మసీదులో గురువారం నుంచి మొహరం ప్రార్థనలు జరగను న్నందున ఏర్పాట్లను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సౌకర్యం, ట్రాఫిక్, వీధి దీపాలు వంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.

ముందస్తుగా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేసినందున ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్ ఈ గోపయ్య, డి ఈ సుబ్బారెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, లడ్డు నరేందర్ రెడ్డి, డోలి రమేష్, మోసిన, సురేష్, పవన్, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. 

అన్నదానం ప్రారంభం 

అమావాస్య సందర్భంగా అల్వాల్ మండల ఆర్య వైశ్య సంఘం ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బలిజ రమేష్, ప్రధాన కార్యదర్శి బాచ్ నగేష్, మండల అధ్యక్షుడు మంచాల రవీందర్, గుండా జగ్గయ్య, ఉప్పల నరేందర్, సత్యం, తడక వెంకటేష్, శ్రీహరి, నాగేశ్వరరావు, సత్యనారాయణ, రూపేష్, మల్లేష్, లక్ష్మీనారాయణ, విశ్వనాథం, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.