calender_icon.png 7 November, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుదర్శన్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

07-11-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి, నవంబర్ 6 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్.

ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డితో ఎమ్మెల్యే మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తన వంతు కృషి చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్ కోరారు. సానుకూలంగా స్పందించి తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి స్పందించారు.