10-08-2025 11:47:00 PM
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 31వ డివిజన్ పరిధిలోని బాలసముద్రంలో రూ. 35 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 60వ డివిజన్ వడ్డేపల్లి టీచర్స్ కాలనీ ఫేస్-2 లో రూ. 35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నుంచి పార్టీలకు అతీతంగా డివిజనల్ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, గత ప్రభుత్వ హయాంలో జరగని ఎన్నో సుదీర్ఘ పనులను సుగుమతరం చేసి ప్రజలకు మెరుగైన సంక్షేమాన్ని పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. అనంతరం వడ్డేపల్లి చెరువు కట్టామీద ఎంతో వైభవీతంగా జరుగుతున్న కట్ట మైసమ్మ ఉత్సవ వేడుకకు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.