calender_icon.png 11 August, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భళా.. భలే ఆర్ట్..

11-08-2025 12:00:00 AM

ఐటీడీఏ పీవో సతీమణి గీసిన చిత్రం   

భద్రాచలం ఆగస్టు 10, (విజయక్రాంతి): ట్రైబల్ మ్యూజియం పిఓ రాహుల్ అపురూప సృష్టి. ఇది భౌతికంగా. కానీ ఈ అద్భుతమైన మ్యూజియం భవనాన్ని, ప్రాంగణాన్ని అపురూప చి త్రంగా మలిచారు పిఓ రాహుల్ సతీమణి మనీషా రాహుల్. పిఓ రాహుల్ తరహాలోనే ఏదో ఒక నూతనత్వాన్ని అందించాలనేది వారి సతీమణి తపన.

అందుకే తన మనసుకు తోచిన బహుళ ప్రజాదారణ పొందుతు న్న ట్రైబల్ మ్యూజియం అంశాన్ని చిత్ర రూపంలో చూపించా రు. ట్రైబల్ మ్యూజియంను ఎంచక్కా తన పెయింటింగ్ రూపంలో భద్రపరిచారు. సహజ తత్వాన్ని సిద్ధించే విధంగా ఈ బొమ్మ రూపుదిద్దుకోవటం తన పెయింటింగ్ కళావైభవానికి ప్రత్యేకంగా చెప్పవచ్చు. పీవో సతీమణి మనీషా రాహుల్ వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కవితలు, కథలు, శీర్షికలు రాయటం, చదవటం ఆమె హాబీ.

పెయింటింగ్ వేయటంలో కూడా ఆమె సిద్ధ హస్తురాలు. పండుగ రోజుల్లో మహిళలతో ఆడిపాడుతూ వారికి సంతోషాన్ని పంచు తుంటారు. చదువుకునే చిన్నారులు అంటే ఆమె కు ఎంతో మమకారం. భద్రాచలంలో ఉన్న చెవిటి,మూగ పాఠశాలలో చదివే చిన్నారులను తర చూ కలుస్తూ వారి పాఠశాలకు వెళ్లి చిన్నారులతో కాలక్షేపం చేస్తూ వారికి తినుబండారాలు, భోజన సౌకర్యం కల్పిస్తూ...వారిని ఎంతో ప్రేమగా చూసుకుం టూ ఉంటారు. భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ మాదిరిగా గిరిజన ప్రగతికి తన వంతు సహకారాన్ని అందజేస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు మనిషా రాహుల్.