31-12-2025 12:00:00 AM
ఆవిష్కరించిన పీసీసీ ప్రాధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్
మేడిపల్లి, డిసెంబర్ 30 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోమేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం లో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. మంగ ళవారం సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని క్యాలెండర్ ను ఆవిష్కరించి సభ్యులకు అందజేశారు.
వచ్చే కొత్త సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని, ప్రజలం దరికీ సుఖసంతోషాలు పంచాలని సంఘ సభ్యులు వాసవి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో మేడిపల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సముద్రాల వెంకటేష్ గుప్త, ప్రధాన కార్యదర్శి ఇరుకుల రాంబాబు గుప్త, కోశాధికారి బెజ్జూరి శేఖర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.