09-08-2025 07:18:49 PM
కామారెడ్డి (విజయక్రాంతి): రక్షాబంధన్(Raksha Bandhan) కార్యక్రమంలో భాగంగా శనివారం కామారెడ్డి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వారి ఆహ్వానం మేరకు శ్రీ శక్తి అమ్మవారి ఆలయంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(MLA Katipally Venkata Ramana Reddy) పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి సన్మానించారు. అనంతరం మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి నీ పద్మశాలి సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ ప్రతినిధులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.