calender_icon.png 9 January, 2026 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరచింత పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

07-01-2026 12:13:08 AM

రెవెన్యూ సమన్వయం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక ఎస్పీ సునీత రెడ్డి

వనపర్తి క్రైమ్, జనవరి 6: వనపర్తి జిల్లాలో పోలీస్ మౌలిక వసతుల బలోపేతానికి కీలక అడుగు వేస్తూ మంగళవారం రోజు జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, అమరచింత పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణం కొరకు  పోలీస్ స్టేషన్కు అనువైన, విస్తారమైన ప్రభుత్వ భూమిని గుర్తించడం పై ప్రత్యేక దృష్టి సారించారు.

అమరచింత పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం కోసం సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేయాలని, సంబంధిత ఎమ్మార్వో ద్వారా వెంటనే సర్వే నిర్వహించాలని జిల్లా ఎస్పీ  సూచించారు స్థల విస్తీర్ణం రహదారి అనుసంధానం, ప్రజలకు సులభంగా చేరుకునే విధానం భవిష్యత్తులో భవన విస్తరణకు అవకాశం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సర్వే నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ సందర్బంగా ఎస్పీ  మాట్లాడుతూ  పోలీస్టేషన్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కాదు అది ప్రజల నమ్మ కానికి ప్రతీకని అందుకే భవిష్యత్తు అవసరాలను ముందే అంచనా వేసి, విస్తారమైన ప్రభుత్వ స్థలంలో నాణ్యమైన నిర్మాణం చేపట్టి  ప్రజల భద్రతకు బలమైన మౌలిక వసతులే పునాది వేయాలని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, ఆత్మకూరు సీఐ శివకుమార్, అమరచింత ఎస్త్స్ర స్వాతి పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.