calender_icon.png 25 November, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేపపిల్లలను గుండ్ల చెరువు నీటిలో వదిలిన ఎంఎల్‌ఏ రాకేష్‌రెడ్డి

25-11-2025 12:47:01 AM

అర్మూర్, నవంబర్24 (విజయ క్రాంతి): గంగాపుత్ర వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  సబ్సిడి పై చేప పిల్లలు పంపిణీ కార్యక్రమం చేపడుతుంది అని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తెలిపారు.   సోమవారం ఆర్మూర్ గుండ్ల చెరువులో 100%సబ్సిడి పై చేప పిల్లలను చేరువలో వదిలారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగా పుత్రుల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం అని గతంలో వాహనాలు పంపిణీ చేశారు అని చెరువులు కబ్జా కాకుండా చూసుకోవాలని చెరువులు అనేవి గంగపుత్రులకు కాకుండా అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతాయి అని అన్నారు. చెరువులో కలుషిత నీరు కలవకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, వేణు, కలిగోట్ గంగాధర్, భారత్, ఉదయ్‌గౌడ్ పాల్గొన్నారు.