calender_icon.png 25 November, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను గౌరవించుకోవడం మన కర్తవ్యం

25-11-2025 12:43:19 AM

ఇందిరమ్మ చీరలను బహుకరించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కలెక్టర్  

భూత్పూర్/అడ్డాకుల, నవంబర్ 24 : ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలందరికీ సమచితస్థానం కల్పిస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో  కెఎంఆర్ ఫంక్షన్‌హాల్‌లో, అడ్డాకుల మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే ఇంది రమ్మ చీరల పంపిణీ  లెక్టర్ విజయేందిర బోయి తో కలిసి మహిళలకు అందజేశారు.

మహిళల శ్రేయస్సు కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, వడ్డీ లేని రుణాలు, మహిళ సంఘాలకు అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణ, పెట్రోల్ బంకులు, ఐదు వంద లకే గ్యాస్ సీలిండర్, మహిళ క్యాంటీన్లు, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళు తున్నామన్నారు.

తహసిల్దార్ కిషన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి  నవీన్ గౌడ్, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ, మాజీ ఎంపీపీ డాక్టర్ కదిరి శేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డితోపాటు   మండల అధికారు లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఆత్మ గౌరవానికి ప్రతీక

గోపాల్‌పేట, నవంబర్ 24: ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. సోమవారం గోపాలపేట, రేవల్లి మండలాలకు సంబంధించి గోపాలపేట మండల కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ లో ఇందిరా మహిళా శక్తి  చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు ఎమ్మెల్యే, కలెక్టర్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శాసన సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.  ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని చెప్పారు.

సిరిసిల్ల నేత కార్మికుల ద్వారా నేసిన చీరలను మహిళలకు పంపిణీ చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ ఉమాదేవి, అదనపు డి ఆర్ డి ఓ సుజాత, డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి, మండల నాయకులు సత్య శిలా రెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, మండలాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇందిరా మహిళ శక్తి చీరాల పంపిణీ  

కృష్ణ: నవంబర్ 24. కృష్ణా మండల పరిధిలోని  కున్సీ, కృష్ణ గ్రామాల్లో మహిళా సమైక్య ద్వారా ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహిం చినట్లు ఏపీఎం బస్వ రాజు , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజప్ప గౌడ తెలిపారు. ఈ సందర్భంగా రాజప్ప గౌడ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు అన్నారు.

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహి ళ సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి గాలికి వదిలి తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పని చేసింన్నారు. ఎమ్మార్వో శ్రీనివాసులు, ఎంపీడీవో విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ రాధా మహదేవ్, మండల యువజన కాంగ్రెస్ అధ్య క్షులు షేక్ సర్ఫరాజ్, కృష్ణ గ్రామ అధ్యక్షులు సిద్ధం, ఆర్‌ఐ శ్రీనివాసు జిపిఓ తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శిలు నర్సింలు, స్వామినాథ్, ఈరన్న, నల్లే నరసప్ప, ఫీల్ అసిస్టెంట్ సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

మహిళ అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం.

రాజాపూర్, నవంబర్ 24 : మహిళల అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపించేశారు.  రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు అందించడమే కాక కొత్త రేషన్ కార్డులు అందించిన్నట్లు తెలిపారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదల గౌరవాన్ని పెంపొందించామన్నారు. 

మార్కెట్ చైర్మన్ అశ్విని, వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, తాసిల్దార్ రాధాకృష్ణ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీ ఓ వెంకట్ రాములు, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, యాదయ్య, రమేష్, విక్రం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నజీర్ బేగ్ పాల్గొన్నారు.