calender_icon.png 5 July, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సును పరిశీలించిన ఎమ్మెల్యే, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

05-07-2025 12:05:36 AM

చేగుంట, జులై 4 : రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం  ప్రహసనంగా ఉందని, విద్యార్థులకు, ప్రయాణికులకు సరిపడే బస్సులు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చేగుంట నుండి భూంపల్లికి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సును దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పరిశీలించారు. 

అనంతరం బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు, ప్రయాణికులతో మాట్లాడుతూ బస్సులు సమయానికి వస్తున్నాయా సరిపోయే సీట్లు దొరుకుతున్నాయా అని అడిగారు. పాఠశాల సమయానికి బస్సులు రావడం లేదని, సీట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణీకులు తెలిపారు,, దీనికి స్పందించిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దుబ్బాక బస్ డిపో డిఎంతో మాట్లాడి పాఠశాల సమయానికి బస్సు వచ్చేలా చూస్తానని హామీనిచ్చారు.