05-07-2025 12:06:36 AM
ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త
ముషీరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): నిష్కలంక నేత కొణిజేటి రోశయ్య అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 92వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, వాసవి సేవా కేంద్రం పూర్వాధ్యక్షుడు కాసనగొట్టు రాజశేఖర్ గుప్తా, ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలా శ్రీధర్, సీనియర్ ఉపాధ్యక్షుడు కాశం కృష్ణమూర్తి, సలహాదారు ముత్యాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మాట్లాడుతూ నిష్కలంగా రాజకీయ నాయకుడు, స్థితప్రజ్ఞుడు, కృషి, పట్టుదల, నిలువెత్తు రూపమన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనితీరును ఆనాటి కేంద్ర ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు ప్రశంసలు అందుకున్న, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అండదండగా నిలిచి లక్ష కోట్ల పైబడి బడ్జెట్ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన వ్యక్తి అని ఆయన కొనియాడారు.
అయన లేకపోవడం ఎంతో లోటన్నారు. ఈ జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందించారు.