calender_icon.png 5 July, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాదిగూడ ఘటనపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

13-06-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ౧౨ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గం లోని గాది గుడా మండలం పిప్పిరి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం పిడుగుపాటుతో  ఆరుగురు రైతులు మృతి చెందడంతో పాటు పలువురికి తీవ్ర గాయా లు అయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ఆమె తెలిపారు.

అనారోగ్యంతో హైదరాబాదులో ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని సంఘటన స్థలానికి రాలేకపో తున్నానని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా రిమ్స్ సూపరింటెండెంట్‌ను కోరారు. ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలకు సానుభూతి తెలిపారు.