calender_icon.png 6 December, 2024 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింధు హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎంఎల్ఎ ఉత్తమ్ పద్మావతి

08-11-2024 09:10:05 PM

హుజూర్ నగర్,(విజయక్రాంతి): హుజూర్ నగర్ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, కార్పొరేట్ స్థాయి హాస్పటల్స్ ఇక్కడ ఎర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ ఎంఎల్ఎ ఉత్తమ్ పద్మావతిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ పట్టణం లో నూతనంగా ఎర్పాటు చేసిన సింధు (గైనిక్ జనరల్ అండ్ అర్థో) హస్పెటల్ ను శుక్రవారం ఎంఎల్ఏ ఉత్తమ్ పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,హాస్పటల్ కు వచ్చె రోగులకు లాభాపేక్ష తో కాకుండా సేవ దృక్పథం తో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు.

అనంతరం హాస్పటల్ యాజమాన్యం ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా. కార్తీక్ గోపతి, డా. సింధు మన్నె, డా. అనుషా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, కౌన్సిలర్స్ ఓరుగంటి నాగేశ్వరరావు, గాయత్రీభాస్కర్, సతీష్, ఎడ్ల విజయ్, రైస్ మిల్లర్స్ అసోషియేషన్ అద్యక్షులు పోలిశెట్టి నరసింహారావు, గజ్జి ప్రభాకర్, కీత మల్లికార్జున్, డీసీసీబీ డైరెక్టర్ దొంగరి వేంకటేశ్వర్లు, డా. సతీష్, డా. రంజిత్, హస్పెటల్ సిబ్బంది పాల్గొన్నారు.