calender_icon.png 23 September, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పన

23-09-2025 12:53:59 AM

ఎమ్మెల్యే జీఎంఆర్ 

అమీన్ పూర్, సెప్టెంబర్ 22 :అమీన్ పూ ర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ సి ద్ధార్థ ఎంక్లేవ్ కాలనీలో మాజీ ఎంపీపీ దేవానందం 5 లక్షల రూపాయల సొంత నిధుల తో తలపెట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పటేల్ గూడ గ్రామ పరిధిలోని ప్రతీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి ప్రతీకగా పటేల్ గూడను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సు ధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నితీశా శ్రీకాంత్, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.