23-09-2025 12:48:27 AM
వనపర్తి, సెప్టెంబర్ 22 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ అనుబంధం ఆత్మకూ ర్,విపనగండ్ల, ఖిపనగండ్ల ఘనపూర్, రేవల్లి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాల పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు చెల్లిస్తున్న రూ 11250 నుండి గత మూడు నెలలుగా కేవలం రూ 9500 మాత్రమే తగ్గించి చెల్లిస్తూ కార్మికుల వేతనాల్లో అవినీతికి పాల్పడుతున్న వెంకటయ్య సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర కా ర్యదర్శి పి.సురేష్ డిమాండ్ చేశారు.
సోమవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి)ఆధ్వర్యంలో ఆ త్మకూర్, విప్పనగండ్ల, ఖిప్పనగండ్ల ఘనపూర్, రేవల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కా ర్మికులకు ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కార్మికుల వేతనాలు పిఎఫ్, ఈ ఎస్‌ఐ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడుతు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న వెంకటయ్య ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం ప్రజావాణిలో జి ల్లా అదనపు కలెక్టర్ కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా పి. సురేష్ మాట్లాడుతూ:- రాష్ట్ర ప్ర భుత్వం,వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాలు,జీవో నెంబర్ 60 ప్రకారం పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులకు 12093 రూపాయలు చెల్లించాలని ఆదేశాలు ఉన్న వెంకటయ్య సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ ఇ ష్టానుసారంగా లోపం ఇష్టమైన వేతనాలు అందిస్తూ కార్మికుల శ్రమ దోపిడికి గురి చే స్తున్నారని మండిపడ్డారు జీవో నెంబర్ 60 ప్రకారం కార్మికులకు పారదర్శకమైన వేతనా లు అందించాలని, ఏజెన్సీ పై విచారణ చేప ట్టి చర్యలు తీసుకోవాలని కార్మికులకు న్యా యం చేసే విధంగా ప్రత్యేక కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
పండుగ పూట పస్తులు ఉండకుండా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ వివిధ ఆస్పత్రుల బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికు లు ఎం.డి సత్తార్,అనిల్,బాలరాజ్, అరుణ్, పార్వతమ్మ,చెన్నమ్మ,నాగమ్మ, శైలజ, మణె మ్మ, బాలకిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు.