calender_icon.png 23 September, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూలను కొలిచే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతం

23-09-2025 12:50:51 AM

కాంగ్రెస్ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ 

చేగుంట, సెప్టెంబర్ 22 :పూలను పూ జించి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని చేగుంట కాంగ్రెస్ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ తెలిపారు. మండల ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని ఆ యన ఆకాంక్షించారు.

బతుకమ్మ పండుగ స్త్రీ శక్తిని ప్రతిబింబించే పండుగగా నిలుస్తుందని తెలిపారు. బతుకమ్మల నిమ్మజ్జనంలో జాగ్రత్తలు పాటించాల ని సూచించారు. మండలంలో ప్రతి ఒక్క రూ ఐకమత్యంతో,సోదరభావంతో బతుకమ్మ పండుగను దిగ్విజయంగా జరుపు కోవాలని ఆకాంక్షించారు.