23-09-2025 12:52:27 AM
ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి, సెప్టెంబర్ 22 :సంగారెడ్డి జిల్లా పోలీసు సిబ్బంది సౌకర్యార్థం గ్యాస్ సి లిండర్ను ఆటో ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సిలిండర్ అవసరమున్న సిబ్బంది ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని, బుకింగ్ చేసిన తర్వాత రెండు రోజుల కాల వ్యవధిలో పోలీసు విభాగంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆటో ద్వారా గ్యాస్ సిలిండర్ను గృహద్వారం వద్దకు తీసుకురావడం జరుగు తుందన్నారు.
ఈ ప్రత్యేక సౌకర్యం ద్వారా సిబ్బందికి సులభమైన, వేగవంతమైన సేవ లు అందించడమే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సిహెచ్ రఘు నందన్ రావు, ఎ.ఆర్ డీఎస్పీ నరేందర్, ఆర్.ఐలు రామారావు, రాజశేఖర్ రెడ్డి, డానియల్, హోమ్ గార్డు సిబ్బంది ఉన్నారు.