09-10-2025 12:00:00 AM
తూప్రాన్, అక్టోబర్ 8 :తూప్రాన్ మం డలం కోనాయిపల్లి పీ.బి గ్రామంలో కుక్కలు స్త్వ్రర విహారం చేస్తున్నాయి. గ్రామంలో గుం పులు గుంపులుగా తిరుగుతూ గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాత్రి సమయాల్లో ద్వీచక్ర వాహనదారులను సై తం వెంబడిస్తున్నాయి. గ్రామ ప్రజలు గ్రా మంలో తిరగాలంటే జంకుతున్నారు. ఇటీవల దూడలపై, మేకలపై దాడులకు పాల్ప డ్డాయి. గ్రామ పంచాయతీ అధికారులు చొరవ చూపి కుక్కల బెడద నుండి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.