calender_icon.png 12 November, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సమస్యలు లేకుండా చూడండి: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

14-08-2024 04:28:19 PM

మహబూబ్ నగర్: నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  ట్రాన్స్ కో ఎస్ఈ పివి రమేష్ దృష్టికి సూచించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్ కో అధికారులతో ఆయన విద్యుత్ సమస్యలపై మాట్లాడారు. ప్రస్తుతం హన్వాడ మండలంలో అత్యవసరమైన  చోట రైతులకు  ట్రాన్స్ ఫార్మర్ లు అందజేయాలని, అలాగే  నూతనంగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్లు పాలమూరు యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, మన్యంకొండ, భగీరథ కాలనీ, బుద్దారం, ఎనిమిది తాండాలలో పురోగతి గురించి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  సబ్ స్టేషన్ స్థలకు కావల్సిన స్థలం సమస్యలు ఉన్న పాలమూరు యూనివర్సిటీ వద్ద స్థల సమస్యను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్య ఉన్న చోట మండల తహశీల్దార్లను అడిగి కావాల్సిన స్థలం సేకరించే విధంగా  ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే ఎస్ఈ కి సూచించారు.  త్వరగా ఈ సబ్ స్టేషన్ లు పూర్తి చేసుకొంటే నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు అధిగమిస్తామని ఆయన అభిప్రాయపడ్డారు.