05-08-2025 07:03:14 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): పొలంలో పని చేస్తూ పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని హాసన్ పల్లి తాండలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం కోల మమత(35) పొలంలో నీళ్లు కట్టేందుకు వెళ్లిన సమయంలో పాము కాటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హుటాహుటిన మమతను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మమత మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మమతకు ఒక కుమారుడు ఒక కూతురు ఆసన్ పల్లి తండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.