05-08-2025 07:10:22 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన తడకమళ్ళ రాములమ్మ క్యాన్సర్ తో బాధపడుతూ మూడు సంవత్సరాల క్రితం చెందగా ఇటీవల ఆమె భర్త తడకమళ్ళ వెంకన్న అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందడంతో వారి ఇద్దరు ఆడపిల్లలు అనాధలుగా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వారికి మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.5000 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య మాట్లాడుతూ పేద దళిత కుటుంబ పిల్లలు పై చదువుల కోసం తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు , ప్రజా ప్రతినిధులు విచారణ జరిపి వారిని గురుకులాల్లో చేర్పించుటకు కృషి చేయాలని కోరారు.