05-08-2025 07:06:07 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల రైతువేదికలో వ్యవసాయం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సాహిస్తూ రైతులకు సబ్సిడీపై మొక్కలు అందిస్తుందన్నారు. నాలుగు సంవత్సరాల వరకూ నిర్వహన ఖర్చులకింద నగదు ప్రోత్సహిం అందుస్తుందని తెలిపారు. SC, ST రైతులకు 90% రాయితీ ఉందని, BC రైతులకు 80% రాయితీ ఉందని, రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కార్యక్రమం లో బెల్లంపల్లి ఏ ఈ ఓ సిహెచ్ తిరుపతి, గురజాల ఏ ఈ ఓ శ్రీను, మాట్రిక్స్ ఫీల్డ్ ఆఫీసర్ హర్షవర్ధన్, రైతులు పాల్గొన్నారు.