01-07-2025 09:36:23 PM
బోథ్ (విజయక్రాంతి): కనిపించని దేవుడు ప్రాణదానం చేస్తే... అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కనిపించిన వైద్యులు ప్రాణాలు నిలబెట్టి పునర్జన్మలను ప్రసాదిస్తారని నాగభూషణం హై స్కూల్(Nagabhushanam High School) ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ అన్నారు. డాక్టర్స్ డే(National Doctors Day) సందర్భంగా మంగళవారం నాగభూషణం విద్యార్థులు బోథ్ పట్టణంలో పనిచేస్తున్న పలువురు డాక్టర్లను సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ల ప్రాముఖ్యత వారు సమాజంలో చేస్తున్న సేవ గురించి విద్యార్థులకు వివరించారు. డాక్టర్లు ప్రసాద్, సంధ్యారాణి, విశ్వనాథ్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.