01-07-2025 09:37:36 PM
బెజ్జంకి: బెజ్జంకి మండల(Bejjanki Mandal) పరిధిలోని గుండారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను మంగళవారం జిల్లా విద్యా శాఖ సెక్టోరియల్ ఆఫీసర్ (రెండవ) భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పిల్లల ఆట వస్తువుల సామాగ్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నదాని, రాబోయే రోజుల్లో పాఠశాల అభివృద్ధికి కంప్యూటర్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మహతి లక్ష్మి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీరాములు, నాగ వేణి, పూర్వ ప్రధానోపాధ్యాయులు రామంచ రవీందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, ఎలుక దేవయ్య సాన వేణు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.