calender_icon.png 24 November, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిచేస్తున్న ఆసుపత్రిలోనే ఎంఎన్‌ఆర్ ఉద్యోగి మృతి

24-11-2025 12:30:48 AM

  1. వైద్యుల నిర్లక్ష్యంతోనే అంటూ బంధువుల నిరసన

మృతుడు 20 ఏళ్ళుగా ఎంఎన్‌ఆర్ సంస్థలోనే ఉద్యోగి..

న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తరలించమంటూ ఆందోళన..

సంగారెడ్డి, నవంబర్ 23(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం తాను పనిచేస్తున్న ఎంఎన్‌ఆర్ ఆసుపత్రిలో నే చేరి ప్రాణాలు కోల్పోయాడు ఒక ఉద్యోగి. డాక్టర్లు సరైన సమయంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం మూలంగానే ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ బాధిత బంధువు లు ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. బాధిత బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం నర్సాపూర్ పట్టణానికి చెందిన కాశెట్టి సంతోష్ కుమార్ (44) గత 20 ఏం డ్లుగా ఎంఎన్‌ఆర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు.

అయితే ఈ నెల 20 గురు వారం సాయంత్రం తన విధులు నిర్వహించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఇస్మాయిల్ ఖాన్ పేట దాటిన తర్వాత హత్నూర పోలీస్ స్టేషన్ లిమిట్ లో సంతోష్ బైక్ ను దౌల్తాబాద్ వైపు నుంచి  మద్యం మత్తులో అతి వేగంగా బైక్ నడుపుతూ ఎదురుగా వచ్చి డీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సంతోష్ నుదు టి పైన గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రాథమిక చికిత్స తీసుకుని తాను విధు లు నిర్వర్తిస్తున్న ఎంఎన్‌ఆర్ ఆసుపత్రిలో చేరాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ప్రాణాలు వదిలాడు.

ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో సరైన చికిత్స అందకపోవడంతోనే స్వల్ప గాయాలతో ఆ సుపత్రిలో చేరిన సంతోష్ మరణించాడని బాధిత బంధువులు, మిత్రులు ఎంఎన్‌ఆర్ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. మృతు డు సంతోష్ తో పాటు ఆయన భార్య సంగీత సైతం ఎంఎన్‌ఆర్ సంస్థలో పదేండ్ల పాటు ఉద్యోగం చేసిందని, బాధిత కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని డి మాండ్ చేశారు.

తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో తనకు సరైన వైద్యం అందిస్తారని న మ్మి వస్తే వైద్యులు సకాలంలో సరైన వైద్యం అందించక నిండు ప్రాణాలను బలికొందని ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యా యం చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించి కూర్చున్నారు. రాత్రి నుంచి బాధిత బంధువులు న్యాయం కోసం నిరసన తెలుపుతున్నా ఎంఎన్‌ఆర్ యాజమాన్యం స్పందించడం లేదని తెలుస్తోంది.

తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకొని బలవంతంగా మృత దేహాన్ని తరలించాలని అదేశాలు ఇస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవు తున్నారు. యాజమాన్యం శనివారం రాత్రి స్పందించి ఆదివారం ఉదయం మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆదివారం ఉదయాన్నే భారీగా పోలీసులను మోహరించారని బాధ్యత కుటుంబ సభ్యు లు వాపోతున్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే సంతోష్ ప్రాణాలు కోల్పోయాడని ఈ విషయంలో రాజకీయ పార్టీల నేతలు, అధికా రులు కలగజేసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అయితే మీడియాను లోపలికి వెళ్ళకుండా ఆంక్షలు విధించారు.