calender_icon.png 24 November, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం

24-11-2025 12:43:09 AM

  1. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతాం

రైతుల కొరకు పట్టు పరిశ్రమ ఏర్పాటుకు రుణాలు

ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవర పల్లి, నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళల అభివృద్ధి, సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండ లం ములుకనూరులోని రైతు వేదిక లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ

తెలంగాణ ప్రభుత్వం పక్షాన 18 సంవత్సరాల పైన ఉన్న మహిళలందరికీ సారే చీరల ను అందిస్తుందన్నారు. ఇందుకోసం సిరిసిల్లలో నాణ్యమైన చీరలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిందన్నారు. మహిళలకు ఐక్యతకి చిహ్నంగా ఈ చీరలు ఉపయోగపడనున్నాయని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడ మే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.

మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పె ట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్, ఆర్టీ సీ బస్సులకు యజమానులవుతున్నారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్ర మాలు చేస్తుందన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నా రు. ఇటీవల ఎల్కతుర్తిలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని, భీమదేవరపల్లి లో కూడా త్వరలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఎంఎన్ జే కాన్సర్ హా స్పిటల్ నుండి మండలంలో కాన్సర్ స్క్రీ నింగ్ టెస్ట్ లు, కరీంనగర్ లయన్స్ క్లబ్ నుం డి కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రభు త్వం ఇంటింటికి చేసిన సర్వేలో ఉన్నత స్థా యిలో ఉన్న కుటుంబాలు ఆ స్థాయికి చేరుకోవడానికి గల కారణాలు చూస్తే ఆ ఇంట్లో ఉన్నత చదువులు చదివిన వారు ఉంటేనే ఆ ఇల్లు అభివృద్ధి చెందిందనే విషయం తేలీందన్నారు. కష్టపడి మీ పిల్లలను మంచిగా చదివించాలని కోరారు. 

భీమదేవరపల్లి , ఎల్కతుర్తి 

సెరీ కల్చర్ హబ్ గా ఉండేది దానిని ప ట్టు కోల్పోకుండా మరింత అభివృధి చేసేలా కృషి చేస్తామన్నారు. మహిళలు అన్ని రంగా ల్లో రాణించాలని, అప్పుడే ఆ ఇల్లు అభివృ ద్ధి చెందుతుందని అన్నారు. ఇందిరమ్మ ఉ క్కు మహిళ అని, ఆమె కుటుంబాన్నే కాదు దేశాన్ని ఐక్యంగా నడిపిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ స్పూర్తితో మనమంతా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

భీమదేవరపల్లి , ఎల్కతుర్తి మధ్య సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, పత్తి విక్రయించేందుకు వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు వెళ్లకుండా ఇక్కడే కొనుగోలు కేంద్రాన్ని రైతులకు అం దుబాటులోకి తెచ్చామాన్నారు. మహిళా సంఘాలు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టీ సారే అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, డి ఆర్ డి ఓ మేన శ్రీను, స్థానిక తహసిల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, ఐకెపి ఎపిఎం వేణు ,ఎల్కతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ , వైస్ చైర్మన్ స్రవంతి, నాయకులు కొత్తకొండ మాజీ చైర్మన్ కొమురవెల్లి చంద్ర శేఖర్ గుప్త, కొలుగూరి రాజు, ఆదరి రవీందర్, ఊస కోయిల ప్రకాష్, చిదురాల స్వరూ ప పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.