calender_icon.png 24 November, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

24-11-2025 12:41:26 AM

  1. మహిళ సంఘాలకు 26కోట్లు వడ్డీ లేని రుణాలు

మేడారం జాతర సమయంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఫుడ్ కోర్ట్, దుకాణాలకు అనుమతి.

రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,శాఖ మంత్రి సీతక్క.

ములుగు,నవంబరు23(విజయక్రాంతి):మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని , 26కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందని ,మేడారం జాతర సమయంలో జాతీయ రహదారికి ఇరువైపులా మహిళా సంఘాలకు ఫుడ్ కోర్ట్ , ఇతర దుకాణాలకు వ్యాపారాలకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

ఆదివారం మల్లంపల్లి మండల కేంద్రంలో మండల పరిధిలోని మహిళా సంఘాలకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డిలతో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

అనంతరం మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 210సంఘాలకు 26కోట్ల రూపాయల ఋణాల పంపిణీ చెక్కను మంత్రి సీతక్క అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటినుంచి తెలంగాణ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని ఈ రుణాలను మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుంటూ వ్యాపార రంగాలలో ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

మల్లంపల్లి మండల కేంద్రం నుంచి యువత ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రతిభ కనబరిచారని, టైర్ల పంచర్ షాప్ తో జీవనం కొనసాగిచ్చే వ్యక్తి కూతురు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా డీఎస్పీ ఉద్యోగం సాధించిందని మరి కొంతమంది యువత పోలీస్ టీచర్ ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యారని వారందరిని అభినందిస్తూ వారి స్ఫూర్తితోనే యువత కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మహిళలు కూడా వ్యాపార రంగాలలో మగవారికి దీటుగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు.

మేడారం జాతర సమయంలో వేలాది మంది భక్తులు జాతరకు వస్తు ఉంటారని ఈ సందర్భంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఫుడ్ కోరట్స్ , దుకాణాలు ,వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఈ అవకాశాన్ని మహిళలు సద్విని చేసుకోవాలని అన్నారు.